![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -13 లో.. సండే రోజు ఎందుకు వచ్చిందో ఏంటో ధనని మిస్ అవుతున్న అనే ఫీలింగ్ లో సిరి ఉంటుంది. దాంతో ధనతో మాట్లాడాలని సిరి మిస్డ్ కాల్ ఇస్తుంది. ధన కాల్ చేస్తాడు. సిరి మాట్లాడుతుంటుంది. సిరిని చూసిన పనిమనిషి.. ఇలా గంటలు గంటలు ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతుందంటే కచ్చితంగా బాయ్ ఫ్రెండ్ తోనే అని శ్రీవల్లికి చెప్తుంది. అలా వాళ్ళు సిరి గురించి మాట్లాడుకోవడం సిరి వాళ్ళ అమ్మ వింటుంది.
ఆ తర్వాత రామలక్ష్మి తనపై వాటర్ పోసిన విషయాన్ని సీతాకాంత్ గుర్తుకు చేసుకుంటాడు. అప్పుడే అతని తాతయ్య వచ్చి.. ఏంటి ఆలోచిస్తున్నావని అడుగుతాడు. రౌడీ బేబీ రామలక్ష్మి అంటు సీతాకాంత్ మాట్లాడుతుంటే వాళ్ళ తాతయ్యకి ఏం అర్థం కాదు. మరుసటిరోజు ఉదయం ఆఫీస్ నుండి సీతాకాంత్ కి వాళ్ళ తాతయ్య ఫోన్ చేసి.. మీటింగ్ కి త్వరగా రమ్మని చెప్తాడు. సీతాకాంత్ బయలుదేరతాడు. మధ్యలో డ్రైవర్ కి ఫోన్ వచ్చిన లిఫ్ట్ చెయ్యకుండా డల్ గా ఉండడంతో.. ఏంటని సీతాకాంత్ అడుగుతాడు. వాళ్ళ అమ్మ గారికి బాలేదని పీఏ చెప్తాడు. మరి వెళ్ళు అంటు క్రెడిట్ కార్డు ఇస్తాడు. ఈ కార్ లోనే వెళ్ళండి. నేను క్యాబ్ బుక్ చేసుకుంటానని సీతాకాంత్ చెప్పగానే.. సీతాకాంత్ కాళ్ళ మీద పడి మరి ఆ డ్రైవర్ థాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత మీటింగ్ కి లేట్ అవుతుందని సీతాకాంత్ క్యాబ్ బుక్ చేసుకుంటాడు. ఆ క్యాబ్ ఎవరిదో కాదు రామలక్ష్మిది. తనని చూసి వద్దని అనుకుంటాడు కానీ మీటింగ్ కి లేట్ అవుతుందని కార్ ఎక్కుతాడు.
ఆ తర్వాత రామలక్ష్మి దొరికిందే ఛాన్స్ అన్నట్లు గా కార్ ని స్లోగా, స్పీడ్ గా వెళ్తూ.. సీతాకాంత్ కి చుక్కలు చూపిస్తుంది.. ఆ తర్వాత సీతాకాంత్ కి వాళ్ళ అమ్మ గిఫ్ట్ ఇచ్చిన డైమండ్ రింగ్ కార్ లో కిందపడిపోతుంది. బిజిబిజీగా సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్తాడు. మరొకవైపు శ్రీవల్లి తన అత్తగారికి కాఫీ తీసుకొని వెళ్తుంది. శ్రీవల్లి ఉదేశ్యం అర్థం చేసుకున్న తను.. నువ్వు ఎందుకు సీతాకాంత్ ని అపార్థం చేసుకుంటున్నావ్? ఈ కుటుంబం కోసం ఎంత చేస్తున్నాడో తెలుసు కదా అని చెప్తుంది. సీతాకాంత్ ఏదో ఒక విషయంలో దొరకనివ్వు అప్పుడు చెప్తానని శ్రీవల్లి తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ ఆఫీస్ కి వెళ్లి వేలికి రింగ్ లేదని ఆఫీస్ మొత్తం వెతుకుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |